Monday, May 12, 2008

***నమ్మకం***

ఒక నాస్తికుడైన(దైవం మీద నమ్మకం లేని) కాలేజి ప్రొఫెసర్ యొక్క క్లాసులో జరిగిన సంభాషణ ...
ప్రతీ ఒక్కరూ చదవవలసిన వ్యాసం. ఇది ఏ ఒక్క మతానికి సంబందించినది కాదు.
ప్రొఫెసర్ క్లాసులో క్రొత్తగా చేరిన ఒక విద్యార్ధిని ఇలా అడిగాడు
ప్రొఫెసర్: నీకు దేవుని మీద నమ్మకం ఉందా?
స్టూడెంట్: అవును, చాలా నమ్మకం ఉంది సార్.
ప్రొఫెసర్: దేవుడు మంచి వాడా?
స్టూడెంట్: అవును.
ప్రొఫెసర్: శక్తివంతుడా?
స్టూడెంట్: అవును.
ప్రొఫెసర్: నా తమ్ముడు కొన్ని రోజుల క్రితం కేన్సర్ వ్యాదితో చనిపోయాడు, చాలా మంది లాగే అతను కూడా దేవున్ని ప్రార్దించాడు, కానీ వ్యాది నయం కాలేదు, అతను చనిపోయాడు. కాబట్టి దేవుడు ఎలా మంచివాడయ్యాడు?
స్టూడెంట్: (నిశ్శబ్దం)
ప్రొఫెసర్: కరెక్ట్, ఈ లోకంలో దెయ్యాలు ఉన్నాయా?
: ఉన్నాయి.
ప్రొఫెసర్
:
దెయ్యం మంచిదా?
: కాదు.
ప్రొఫెసర్: దెయ్యాలు ఎక్కడి నుండి వచ్చాయి?
స్టూడెంట్: దేవుని సృష్టి నుండి.
ప్రొఫెసర్: ఈ రోజుల్లో దెయ్యాల్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అయితే దేవుడు వాళ్ళని సృష్టించడం ఎందుకు?
స్టూడెంట్: (నిశ్శబ్దం)
ప్రొఫెసర్: ఈ లోకంలో అనారోగ్యాలు, అవినీతి, అసమానత్వాలు, అందవికారాలు లాంటి ఎన్నో భయంకరమైనవి ఉన్నాయా? లేవా?
స్టూడెంట్: ఉన్నాయి.
ప్రొఫెసర్: ఎవరు వీటిని సృష్టించారు?
స్టూడెంట్: (నిశ్శబ్దం)
ప్రొఫెసర్: నీ పంచేంద్రియాల ద్వారా ఎప్పుడైనా దేవుడు అనే వాడిని గుర్తించావా?
స్టూడెంట్: లేదు సార్.
ప్రొఫెసర్: చెవులతో వినడం కానీ, కళ్ళతో చూడడం కానీ , అతని వాసన కానీ, రుచి కానీ, సర్శ కానీ గుర్తించావా?
స్టూడెంట్: నాకు భయంగా ఉంది సార్, నాకెప్పుడూ అలా జరగలేదు.
ప్రొఫెసర్: (నవ్వుతూ), అయినా ఇంకా నమ్ముతున్నావా?
స్టూడెంట్: అవును సార్.
ప్రొఫెసర్: సైన్స్ ప్రకారం నేను ప్రయోగ పూర్వకంగా, పరీక్షల ద్వారా, ప్రదర్శనల ద్వారా దేవుడు లేడనీ నీకు నిరూపించాను, దీనికి నువ్వేమంటావు?
స్టూడెంట్: ప్రొఫెసర్! ఉష్ణం(వేడి) అనేది ఉందా?
ప్రొఫెసర్: ఉంది.
స్టూడెంట్: చలి అనేది ఉందా?
ప్రొఫెసర్: ఉంది.
స్టూడెంట్: (గట్టిగా)లేదు సార్, చలి అనేదే లేదు.
(ఆ క్లాస్ రూం మొత్తం నిశ్శబ్ధం అయ్యిపోయింది)
(కొంత సేపు మౌనం...)
స్టూడెంట్: సార్, వేడి చాలా రకాలుగా ఉండవచ్చు, బాగా ఎక్కువ వేడి, ఎక్కువ వేడి,తక్కువ వేడి ఇలా ఎన్నో కానీ చలి అనేది ఈ లోకంలో లేదు. మనం 0 డిగ్రీల కంటే 458 డిగ్రీలు క్రిందకు వేడిని తగ్గించవచ్చు కానీ మనం అక్కడకు వెళ్ళలేము. మళ్ళీ చెబుతున్నాను చలీ అనేది ప్రత్యేకంగా ఈ లోకంలో ఏదీ లేదు, వేడి లేకపోవడమే చలి. చలిని మనం కొలవలేము, చలి అనేది వేడికి వ్యతిరేకం కాదు, కేవలం వేడి లేక పోవడమే చలి.
( క్లాసు మొత్తం చాలా నిశ్శబ్ధంగా ఉంది)
స్టూడెంట్: సార్, చీకటి అంటే ఏమిటి? చీకటి అనేది ఉందా?
ప్రొఫెసర్: ఉంది, రాత్రి పూట మనకు కనిపించేది చీకటే కదా!
స్టూడెంట్: సార్, మీరు మళ్ళీ తప్పు చెబుతున్నారు. చీకటి అనేది కేవలం వెలుగు(కాంతి) లేకపోవడం మాత్రమే.
కాంతి చాలా రకాలుగా ఉంటుంది, కాంతి, తక్కువ కాంతి, ఎక్కువ కాంతి, జిగేల్ మనే కాంతి(ప్లాష్)ఇలా ఎన్నో,
కానీ... మనకు స్థిరంగా ఎటువంటి కాంతీ అందక పోతే అది చీకటి. ఒప్పుకుంటరు కదూ?
నిజానికి, చీకటి మరింత చీకటి చేయలేము సార్.
ప్రొఫెసర్: ఇంతకీ నీవు చెప్పాలనుకునేది ఏమిటి బాబూ?
స్టూడెంట్: నేను చెప్పాలనుకొనేది, మీరు తీసుకొన్న సిద్దాంతమే తప్పు అని.
ప్రొఫెసర్: తప్పా? ఎలాగో చెప్పగలవా?
స్టూడెంట్: సార్, మీరు ద్వైత(Dual) సిద్దంతం సూత్రీకరిస్తున్నారు. మీరు వాదిస్తున్న దాని ప్రకారం ప్రాణి జీవించడం, మరణించడం రెండూ ఉన్నాయి. మీ దృష్టిలో దేవుడు పరిమితమైన వాడు, అతన్ని మనం కొలవగలము. కాని, సైన్సు కనీసం ప్రతీ ఆలోచనను కూడా వివరించలేదు. సైన్సు అయస్కాంతత్వం, విద్యుత్ సిద్దంతాలను చాలాచోట్ల ఉపయోగిస్తుంది, కానీ, వాటిని ఎవ్వరూ చూడలేదు. మరణాన్ని పుట్టుకకు వ్యతిరేకంగా చూసే వారు ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. మరణం అనేది కేవలం జీవం లేకపోడం మాత్రమే.
ఇప్పుడు చెప్పండి ప్రొఫెసర్, మీ విధ్యార్దులకి మనిషి కోతి నుండి ఉధ్బవించాడని చెబుతున్నారా?
ప్రొఫెసర్: నువ్వు మాట్లడుతున్నది మానవావిర్భావం గురుంచే అయితే, అవును నేను చెబుతాను.
స్టూడెంట్: ఈ లోకంలో ఎవ్వరూ మొదలు నుండీ మానవావిర్భావం చూడలేదు, మీరు చెబుతున్న మానవావిర్భావ క్రమం బహుసా అభిప్రాయం మాత్రమే, మీరు మీ అభిప్రాయాన్ని ఎందుకు మాకు చెబుతున్నారు? మీరేమీ గుడిలో పూజారి కాదే?
(క్లాసంతా చప్పట్లు)
స్టూడెంట్: ఈ క్లాసులో ఎవరైనా ప్రొఫెసర్ మెదడును చూసారా? కనీసం వాసన కానీ, స్పర్శ కానీ చూసారా?
(అందరూ గట్టిగా నవ్వుతున్నారు...)
ఎవ్వరికీ అలా జరగలేదు కాబట్టి సైన్సు ప్రకారం ప్రొఫెసర్ గారికి మెదడు లేనట్లా? అయితే ఆయన చెప్పేది మనం ఎందుకు నమ్మాలి?
(క్లాసు రూం ఒక్కసారిగా నిశ్శబ్ధంగా అయ్యిపోయింది, ప్రొఫెసర్ గారు పడుతున్న ఇబ్బంది అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది)
ప్రొఫెసర్: కొన్ని విషయాల మీద మనం నమ్మకం ఉంచాలి బాబూ!
స్టూడెంట్: అదే సార్! దేవుడికీ మనిషికీ మద్య ఉన్న సంబందం కూడా *నమ్మకం* అదే మనలందరినీ ముందుకు నడిపిస్తుంది.

****ఇది జరిగిన కథ******
ఇంతకీ ఆ స్టూడెంట్ ఎవరో తెలుసా?
****అబ్దుల్ కలాం ****
భారతదేశ మాజీ రాష్ట్రపతి

Thursday, May 8, 2008

చిలిపి ప్రశ్నలు

  • ఇంగ్లీష్ లో Proకు వ్యతిరేక పదం Con అయితే Progress కు వ్యతిరేక పదం Congress??
  • ప్రేమ గుడ్డిది అనేది నిజమైతే, తొలి చూపులోనే ప్రేమ నిజమా? అబద్దమా?

నవ్వుల్,నవ్వుల్...

  • డాక్టర్ : నీ భర్త కు కొంచెం విశ్రాంతి, మనఃశాంతి కావలమ్మా, నిద్ర మాత్రలు రాస్తున్నాను.
    భార్య: అలాగే డాక్టర్, మా ఆయన చేత ఎప్పుడు ఈ మాత్రలు వాడించమంటారు ?
    డాక్టర్: ఆ మాత్రలు రాసింది నీకమ్మా. మీ ఆయనకు కాదు.
    భార్య:??**!!!

  • ఇది చాలా రోజుల క్రిందటి మాట...
    నిద్రాహారాలు మాని, సంసారం వదిలివేసి, నవ్వడమే మరిచిపోయిన వారిని సాధువులు, సన్యాసులుగా పిలిచేవారు. కాని ఇప్పుడు వాళ్ళని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పిలుస్తున్నారు
  • బైక్ నడుపుతున్న వాడి షర్ట్ వెనుక ఇలా వ్రాసి వుంది. మీరు కాని దీన్ని చదివితే దయచేసి నాకు ఫోను చేసి నా గర్ల్ ఫ్రెండ్ పడిపోయింది అని చెప్పండి....
  • భయం అంటే?
    పరీక్షలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నపుడు, నీ పుస్తకాలన్నీ క్రొత్త పేజీల్లా వాసన వస్తుంటే అప్పుడు నీ కడుపు లోతుల్లోంచి తన్నుకు వచ్చే బాధే భయమంటే.
  • అమ్మాయి: మీ దగ్గర హృదయాన్ని హత్తుకొనే ప్రేమ సందేశాలున్న గ్రీటింగ్ కార్డులున్నాయా?

  • సేల్స్ మేన్: ఓ! ఇది చూడండి మేడం, ఆ కార్డులో(నేను ఎప్పటికీ ప్రేమించే ఒక మంచి అబ్బాయి కోసం...) అని ఉంది
    అమ్మాయి: చాలా బావుంది, నాకు ఒక డజను కార్డులు కావాలి
    సేల్స్ మేన్: ??**!!

Wednesday, May 7, 2008

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక


రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

తేట తేట తెలుగు లా ...

సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు